25 May, 2026 | 3:30 AM

ఆత్మీయ పలకరింపులతో పదవ తరగతి విద్యార్థులు

25-05-2026 01:47 AM

తాడ్వాయి, మే, 24( విజయక్రాంతి): ఆత్మీయ పలకరింపులు, ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆనాటి చిలుపి చేష్టలు గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు పూర్వ విద్యార్థులు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ లోని రెడ్డి సంఘంలో ఆదివారం పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

2000-01 బ్యాచుకు చెందిన పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ... విద్యార్థి దశ ఎంతో కీలకమైందని విద్యార్థి దశలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో వారు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని తెలిపారు.

బాల్యంలో చేసిన విషయాలను గుర్తు చేశారు. ఉపాధ్యాయులు సంఘంలో మార్గదర్శకులుగా ఉండాలని,సంఘాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోశించాలని తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ... తాము చదువుకున్న పదవ తరగతిలో ఉపాధ్యాయులను గుర్తుచేసుకొని పాదాభివందనం చేశారు.

ఉపాధ్యాయులకు ఎప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కలయిక అపురూపమైనదని ఎప్పుడు మర్చిపోలేని రోజు అని తెలిపారు.25 సంవత్సరాలకు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తమ గురువులను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దత్తాత్రి, రామచందర్ రావు, గంగాగౌడ్, గంగారెడ్డి, సాయగౌడ్, రాజ్ కుమార్, శ్రీనివాస్, విద్యార్థులు గైని రాజు, బాల్ రాజ్ రెడ్డి,శ్రీనివాస్, అనిల్,కృష్ణాకర్ రావు, రాజలింగం, కవిత, స్వప్న, మంజుల, సంధ్య, శ్రావణి, రాజమణి,రజిత తదితరులు పాల్గొన్నారు.