20-02-2026 01:43:03 AM
‘రిలయన్స్’ అధినేత ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౧౯: మొబైల్ డే టా తాము సృష్టించిన విప్లవంలాగానే కృత్రిమ మేధ (ఏఐ)లోనూ సరికొత్త విప్ల వాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిలో భాగంగానే జియో సంస్థ రానున్న ఏడేళ్లలో 1౦ లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకే శ్ అంబానీ వెల్లడించారు. న్యూఢిల్లీ ఇండి యా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గురువారం ఆయన ప్రకటించారు.
ఏఐ సాంకేతికతలో మరిన్ని మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుసంపన్న యుగానికి కృత్రి మ మేధ నాంది పలకాల్సి ఉందన్నారు. ఏఐ కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుందా? లేదంటే ప్రజలందరికీ అవకాశం చేరువ అవుతుందా? అన్న చర్చ ప్రపంచమంతటా నడుస్తోందని వివరించారు. తమ సంస్థ ప్రజలకు ఏఐని మరింత చేరువ చేయాలని సంకల్పించిందని తెలిపారు. తమది కేవలం ఊహాజనిత పెట్టుబడి కాదని, దేశ నిర్మాణంలో ఈ పెట్టుబడి ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు.