07-07-2025 12:00:00 AM
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్
కుమ్రం భీం ఆసిఫాబాద్ , జూలై 6 (విజయక్రాంతి): వ్యాపార సంస్థలలో పని గం టలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 282 ను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.
ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకు 8 గంటల పని సమయాన్ని పెంచి 10 గంటలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వం తీసుకొచ్చిన జీవోతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.పని భారం పెరగడంతో ఇప్పటికే కార్మికులు అనేక అనారోగ్య సమస్యలతో సతమవుతాం అవుతున్న సమయంలో ప్రభుత్వం అదనంగా రెండు గంటలు పెంచడం దారుణంగా ఉందన్నా రు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఈనెల తొమ్మిదిన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో శంకర్, రవి, గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.