calender_icon.png 7 July, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమర్థవంతమైన పాలనే ప్రభుత్వ లక్ష్యం

07-07-2025 12:01:21 AM

- మంత్రి వివేక్ వెంకటస్వామి

- అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

చెన్నూర్, జూలై 6: రాష్ట్రంలోని ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వా మి అన్నారు. ఆదివారం కోటపల్లి మండల కేంద్రంలోనీ పౌరసరఫరాల శాఖ గోదాములో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మం త్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు సమర్థవంతమైన ప్రజాపాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అర్హులైన నిరుపేదలకు గూడు కల్పించాలని ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, సొంత స్థలం కలి గి ఉండి అర్హత గల వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపజేసి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు.

చెన్నూర్ నియో జక వర్గంలో 12 వేల దరఖాస్తులు రాగా అర్హులందరికీ అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మా ణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందని, అక్రమ ఇసుక రవాణా, ఇసుక మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నియోజకవర్గంలోని సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 

అనంతరం 423 మంది ఇందిరమ్మ ఇం డ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. కోటపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 5 లక్షల రూపాయల సి. ఎస్.ఆర్.  నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ ఆర్.ఓ. వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. వనమహోత్సవం- కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేసి పూర్తి స్థాయిలో సాధించాలని తెలిపా రు. ఈ కార్యక్రమాలలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.