calender_icon.png 7 July, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టుల నీళ్ల కోసం రైతులతో దండయాత్ర

07-07-2025 12:48:06 AM

-తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలి 

-లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులతో వెళ్లి మోటార్లు ఆన్ చేస్తాం 

-శ్రీశైలంలోకి వరద వచ్చి 36 రోజులైనా కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు 

- కృష్ణా నీళ్లు ఆంధ్రాకు వదలడమే ఈ ప్రభుత్వ లక్ష్యం 

-కాళేశ్వరం ప్రాజెక్టు అక్షయపాత్ర లాంటిది 

- నీళ్ల విలువ తెలియని పాలకులతో తెలంగాణకు ఇబ్బందులు 

-మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ప్రాజెక్టుల నుంచి నీళ్ల విడుదల కోసం రైతులతో కలిసి దండయాత్ర చేస్తామని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. కాళేశ్వరం కింద రైతులు నారుమళ్లు పోయాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారని, వెంటనే కాళేశ్వరం మోటార్లు ప్రారంభించి రిజర్వాయర్లు నింపి మొదటి పంటకు నీళ్లు ఇవ్వాలని  హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

నీళ్లు ఇవ్వకపోతే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది రైతులతో కలసి కన్నెపల్లికి వెళ్లి మోటార్లు ఆన్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు మోటార్లు ప్రారంభించక పోతే వేలాదిమంది రైతులతో ప్రాజెక్టు వద్దకి వెళ్లి మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వస్తుందని  హెచ్చరించారు.

ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టబోమని, లక్షలాది రైతులతో కదిలి మోటార్లు ప్రారంభించి నీళ్లిచ్చి చూపిస్తామన్నారు. నీళ్ల విలువ తెలియని వారు పాలకులుగా ఉండటం వల్ల తెలంగాణ ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే సాగునీటితో పాటుతాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మేడిగడ్డ దగ్గర ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని, కన్నెపల్లి పంప్‌హౌజ్ యొక్క మినిమం డ్రా డౌన్ లెవెల్ (ఎండీడీఎల్) 93.5 మీటర్లు ఉందన్నారు. ఇప్పుడు ప్రవాహం 96 మీటర్ల ఎత్తులో  ఉందన్నారు. ఎండీడీఎల్ కంటే రెండున్నర మీటర్లు ఎత్తులో నీళ్లు పోతున్నా ఎందుకు మోటర్ ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు.

గోదావరి నదిలో ఐదు వేల క్యూసెక్కుల నీళ్లు ఉన్నా ఒక్క మోటార్ ఆన్ చేసి నీళ్లు తరలించుకునే అవకాశం ఉందన్నారు. యావరేజ్‌గా ఒక్కొక్క మోటారు 2,100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుందని, మేడిగడ్డ బ్యారేజ్‌తో సంబంధం లేకుండా, అన్ని గేట్లు ఎత్తి ఉన్నా కూడా రోజుకి రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పర్ఫెక్ట్

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పర్ఫెక్ట్ గా ఉన్నాయని  కోదండరామ్ అడిగిన ప్రశ్నకు ఉత్తంకుమార్ రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇచ్చారన్నారు. అన్నారం, సుందిళ్ల కన్నెపల్లి పంప్‌హౌజ్ లక్షణంగా పనిచేస్తున్నాయని, బటన్ నొక్కితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమపై కక్షతో  రైతుల కడుపు కొట్టద్దని హితవు  పలికారు. ఎస్సార్‌ఎస్పీలో 18 టీఎంసీల నీళ్లు కూడా లేవన్నారు.

ఎస్సారెస్పీ కింద 14లక్షలు, మిడ్ మానేరు కింద లక్ష ఎకరాలు, కాళేశ్వరం కింద రెండు లక్షల ఎకరాలు ఆయకట్టు ఉందని, ఈ రోజు కాళేశ్వరం మోటర్లు ప్రారంభిస్తే 15 జిల్లాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని హరీశ్ తెలిపారు. మంత్రి ఉత్తం నియోజకవర్గం కోదాడ వరకు ఎస్సారెస్పీ స్టేజీ 2 కింద నీళ్లు తీసుకొని పోవచ్చు. మొదటి పంటకు సూర్యా పేట, తుంగతుర్తి, కోదాడ, ఉమ్మడి వరంగల్, కరీంనగర్,  నిజామాబాద్, మెదక్ జిల్లాలకు నీళ్లిచ్చే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వానిది క్రిమినల్ నెగ్లిజెన్సీ 

 కళ్ల ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోని ప్రభుత్వం తీరు క్రిమినల్ నెగ్లిజెన్సీ కిందికి వస్తుందని  ఆయన విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరచి ఉన్నా కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉందన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగినాయని ప్రాజెక్టుని పడావు పెట్టారని, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉందని హరీశ్ చెప్పారు.

ప్రభుత్వం కావాలని మోట ర్లు ఆన్ చేయకుండా రైతులను గోసపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రంగ నాయ క సాగర్, మల్లన్నసాగర్, కొండపోచ మ్మ సా గర్, బస్వాపూర్ ఇలా దాదాపు 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను ని ర్మించి రెడీగా పెట్టామని, నీళ్లు ఎత్తుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బం ది ఏమిటని ప్రశ్నించారు. ఆ నీళ్లను తీసుకుం టే సాగునీటికి, తాగు నీటికి ఇబ్బందులు ఉం డవన్నారు. కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయమంటే 19 నెలల నుంచి ప్రభు త్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. 

పాలమూరు రైతుల కడుపు కొడుతున్నరు

పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం పాలమూరు రైతుల కడుపు కొడుతున్నారని, మహబూబ్ నగర్ బిడ్డనని కోతలు కోయడ ం కాదని రేవంత్‌రెడ్డి చేతల్లో చూపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్డీఎస్‌ఏ దేశం మొత్తం మీద కాళేశ్వరం మీదనే పనిచేస్తోందా అని, పోలవరం డయా ఫ్రమ్ వాల్, గేట్‌వాల్ కొట్టుకుపోయినా ఎందుకు ఎన్డీఎస్‌ఏ స్పందించలేదనిప్రశ్నించారు.

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బంధానికి ఇది నిదర్శనమని, ఎస్‌ఎల్బీసీ కుప్పకూలి దాని భవిష్యత్తు ప్ర శ్నార్ధకంగా మారితే ఎందుకు ఎన్డీఎస్‌ఏ రాలేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజె క్టు అక్షయ పాత్ర లాంటిదని, దాన్ని తక్కువ చేసి చూపెట్టడం సరికాదని ఈ సందర్భంగా హితవు పలికారు.

కృష్ణ నీళ్లను ఆంధ్రకు వదిలిపెట్టడమే ప్రభుత్వ లక్ష్యం

శ్రీశైలంలోకి వరద వచ్చి 36 రోజులు అవుతోందని, ఇప్పటివరకు కల్వకుర్తి మోటర్లు ఆన్ చేయలేదని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత కృష్ణాలో అతి తక్కువగా 28 శాతం మాత్రమే నీళ్లను రేవంత్ ప్రభుత్వం వాడుకుందని విమర్శించారు. చంద్రబాబు కోసం 65 టీఎంసీలను ధారా దత్తం చేశారని, కృష్ణ నీళ్లను ఆంధ్రకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు.

చంద్రబాబుతో  మీకున్న చీకటి ఒప్పందం ఏంటని? మహబూబ్ నగర్ జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు వదిలారని విమర్శించారు. ఈసారి కూడా ఆంధ్రకు నీళ్లు వదిలే ప్రయత్నం చేస్తున్నారని, పాలమూరు రైతుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. మే 28న జూరాలకు వరద వస్తే జూన్ 12న ఒక మోటారు, జూన్ 25న ఒక మోటార్‌ని ప్రారంభించారన్నారు.

గతంలో జూరాలకు రేపు నీళ్లు వస్తాయనుకుంటే ఈరోజే నీళ్లను తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వాళ్లమన్నారు. బీమాలో 20 రోజులు, కోయిల్ సాగర్‌లో దాదాపు 15 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభించారని ఆరోపించారు. జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్‌కి గ్రావిటీ ద్వారా నీళ్లు పారుతాయని, వాటిని కూడా తీసుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.