07-07-2025 09:35:23 AM
భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్
పెన్ పహాడ్: మండల పరిధిలో పలు గ్రామాల్లో హిందువులు, ముస్లింలు కలిసి భక్తిశ్రద్ధలతో మొహరం వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. విభిన్న కుల,మతాల ఐకమత్యమే తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమని ముస్లిం మైనార్టీ మండలాధ్యక్షుడు షేక్ మస్తాన్(Muslim Minority President Sheikh Mastan) అన్నారు. ఈ సందర్భంగా..అసైదులా.. హారతి..కాళ్ల గజ్జల గమ్మతి.. అంటూ నృత్యాలు చేసారు. ముస్లిం మహిళలు.. ఐదోష్.. ఐదోష్.. అంటూ ముస్లిం బాష లో పాటలు పాడుకున్నారు. పీర్లను గ్రామలోని పూరవీధులలో ఊరేగింపు నిర్వహించారు. మండల పరిధిలోని అనంతారం, పెన్ పహాడ్, దోసపహాడ్, పొట్లపహాడ్, గాజులమల్కాపురం తదితర గ్రామాలలో ముస్లింలు హిందువులు కలిసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముజావర్ సోను, లతీఫ్, చాందు, మైబెల్లి, షఫీ, షరీఫ్, సాజిద్, అక్బర్, సయ్యద్, లతీఫ్, అహ్మద్ సైదులు, బాజీ, సొందు, సలీం, సమీర్, యూసఫ్, ఆసిఫ్, జానీ బాబు, జాన్ బి, రేష్మ, జానీ బేగం, మైబా, బేగం తదితరులు పాల్గొన్నారు