17 May, 2026 | 1:15 AM

ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలి

17-05-2026 12:00 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, మే 17 (విజయక్రాంతి): ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. గడ్డి అన్నారం డివిజన్‌లోని ఆస్పరెంట్ అడ్డా- టీ పాయింట్ వద్ద నిరుద్యోగులతో శనివారం ఎమ్మెల్యే టీ తా గుతు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ ప్రాంతంలో నిరుద్యోగ యువతను కలిసి పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఖాళీలను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి తదితర హామీలిచ్చారని పేర్కొన్నారు. ఈ హామీలను నమ్మి యువత  కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వారిని నట్టేట ముంచారని విమర్శించారు.

ఉద్యోగాల ఊసే లేకుండా నిరుద్యోగ యువతను ప్రభుత్వం నిరాశలోకి నెట్టిందన్నారు. యువత భవిష్యత్తును దృష్టి లో ఉంచుకుని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మొద టి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయి తే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు.

జీవో 29, జీవో 46లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రనాయక్, శంకర్, శింబు నాయక్, భూక్యాకుమార్, నవీన్ పట్నాయక్, సింధురెడ్డి, ఆకాష్, అంజలి, శ్రీదేవి, అశోక్, నందు, శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.