డంపింగ్‌లో అశాస్త్రీయ విధానాలు
- కేటీఆర్‌ను కలిసిన జేఏసీ బృందం
- సీఎంకు లేఖరాస్తా.. ప్రజల పక్షాన నిలుస్తా: కేటీఆర్
దమ్మాయిగూడ, మే 16 (విజయక్రాంతి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల పక్షాన పోరాడుతున్న జేఏ సీ బృందం శనివారం బీఆర్‌ఎస్ రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును కలిసి డంపింగ్ యార్డ్‌లో జరుగుతు న్న అశాస్త్రీయ విధానాలు, సుమారు 20 లక్షల మంది జనాల ఉసురుతీస్తున్న రామ్‌కి సంస్థ యాజమాన్యం గురించి వివరిస్తూ ఆ వేదన వ్యక్తంచేశారు. లక్షల టన్నుల్లో చెత్తను పోగుచేసి సెగ్రీగేట్ చేయకుండా, బయోమైనింగ్ చేయకుండా నిర్లక్ష్యంగా 339 ఎకరా లలో చెత్తకుప్పతో నింపి నేల కాలుష్యం, వాయుకాలుష్యం, జలకాలుష్యం సృష్టిస్తున్నారని చెప్పారు.
సీఎంకు కూడా పరిస్థితు లను తెలియజేశామన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసి ప్రజల పక్షాన నిలుస్తానని హామీ ఇచ్చారు. మీథేన్ గ్యాస్ పరిమితికి మించి విడుదల కావడం ఆందోళనకరమన్నారు. ప్రపంచంలో చెత్తగుట్టలలో జవహర్‌నగర్ నాలుగో స్థానంలో నిలవడం ఆందోళనకర విషయమన్నారు. కొత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీ నర్ డాక్టర్ బీ శంకర్ నారాయణ, కో కన్వీనర్లు ఏనుగు సంజీవరెడ్డి, మారం సమ్మిరెడ్డి, గవిని స్వర్ణ శ్రీనివాస్, దమ్మాయిగూడ మా జీ చైర్ పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






