కామారెడ్డిలో బ్రాహ్మనందం సందడి
ఓ ప్రైవేట్ కార్యాక్రమానికి వచ్చి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంట్లో సన్మానం
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఆదివారం హస్యనటుడు బ్రహ్మనందం వచ్చి సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి దంపతుల పిలుపు మేరకు వారి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతులు హస్యనటుడు బ్రహ్మనందాన్ని శాలువతో, పూలబొకెతో సత్కరించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి లకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి సెల్పీలు దిగారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ పనిమీద కామారెడ్డికి వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాత శివకృష్ణ మూర్తి, చాట్ల వంశీ తదితరులు పాల్గొన్నారు.






