మైక్రోసాఫ్ట్‌లో 11 మందికి ఉద్యోగాలు
- యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థుల ఘనత
- తొలి బ్యాచ్ నుంచే రికార్డుస్థాయి ప్లేస్‌మెంట్స్
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సి టీ తొలి బ్యాచ్ నుంచే అద్భుత ఫలితాలను నమోదు చేస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఏకంగా 11 మంది విద్యార్థులు ఉద్యో గాలు సాధించడం విశేషంగా నిలిచింది.
డేటా సైన్స్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన మొత్తం 14 మంది విద్యార్థుల్లో 11 మంది మైక్రోసాఫ్ట్ ఎంపిక కావడం యూనివర్సిటీకి గర్వకారణంగా మారింది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి సుమారు రూ.7 లక్షల ప్రారం భ వేతన ప్యాకేజీ లభించనున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. యువతకు పరి శ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అం దించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించింది.






