17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సర్కారు బడిలో చేరండి.. మీ భవితకు బంగారు బాటలు వేసుకోండి

01-06-2025 05:03 PM

వలిగొండ (విజయక్రాంతి): సర్కార్ బడిలో చేరండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి అని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు అయిటిపాముల రవీంద్ర(Congress Party Mandal Leader Aitipamula Ravindra) అన్నారు. ఆదివారం విద్యార్థిని, విద్యార్థులకు ఏర్పాటుచేసిన వేసవి క్రీడ శిక్షణ తరగతుల శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యతో పాటు క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతుందని అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అందించడం జరుగుతుందని అన్నారు.

ప్రైవేటు పాఠశాలలలో వేలాది రూపాయలను చెల్లించి విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి కావద్దని ప్రైవేటు పాఠశాలను వద్దని ప్రభుత్వ పాఠశాల ముద్దని అన్నారు. తాను కూడా వలిగొండ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఉన్నత స్థాయికి ఉదయానని ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలలో చదివారు ఉన్నత శిఖరాలను అధిరోహించారని అన్నారు. త్వరలో ప్రారంభం కాబోయే విద్యా సంవత్సరంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. వేసవి శిక్షణ శిబిరం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో పాల్గొన్న వారికి జూన్ 2న బహుమతుల ప్రధాన చేయడం జరుగుతుందని అన్నారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ సందర్భంగా వలిగొండ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.