2 July, 2026 | 2:59 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

01-06-2025 05:07 PM

25 ఏళ్ల అనంతరం మిత్రుల సందడి..

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని నాగార్జున పాఠశాల 1999-2000 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల అనంతరం ఆదివారం మళ్లీ ఒక్కచోట కలుసుకొని, ఆత్మీయ సమ్మేళనాన్ని హర్షోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యా బీజాలు నాటిన స్థలాన్ని సందర్శించి, గతాన్ని తలచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

విద్యార్థుల సాఫల్యంలో కీలకపాత్ర పోషించిన అప్పటి ప్రిన్సిపల్ నారాయణ రెడ్డిని, ఇతర ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, వారి ఆశీస్సులు పొందారు. పాత రోజులను స్మరించుకుంటూ, ముచ్చటైన జ్ఞాపకాలను పంచుకుంటూ మిత్రులు ఒకరికొకరు మళ్లీ కలిసిన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా కృషి చేసిన రాకేష్ రెడ్డి వందనని మిత్రులందరూ ప్రత్యేకంగా సన్మానించి, వారి సేవలపట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో హాజరైన పూర్వ విద్యార్థి హృదయంలో ఓ మధురానుభూతిగా నిలిచింది.