23 May, 2026 | 5:21 PM

బీబీపాటిల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరికలు

20-04-2024 12:25 AM

కామారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బీబీపాటిల్ వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గాంధారి మాజీ జడ్పీటీసీ తానాజీరావు, బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు పోతంగల్ కిషన్‌రావు, సదాశివనగర్‌కు చెందిన బుడిగె నర్సింహరెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.