23 May, 2026 | 6:08 PM

రైతులకు ఇబ్బందులు కలగొద్దు

20-04-2024 12:25 AM

కరీంనగర్, ఏప్రిల్ 19(విజయక్రాంతి) : కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి వి.పద్మావతి సూచించారు. చొప్పదండి మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆమె సందర్శించారు. వేసవి దృష్ట్యా రైతుల కు మంచినీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైస్ మిల్లర్లు ఎవరైనా ధాన్యాన్ని దింపుకోవడంలో ఇబ్బందులకు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అనంతరం చొప్పదండి వ్యవసా య మార్కెట్ యార్డును సందర్శించి పంట ల కొనుగోళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఎం నర్మద పాల్గొన్నారు.