31-07-2025 12:00:00 AM
సదాశివనగర్, జులై 30(విజయక్రాంతి): మండలంలోని మల్లుపేట గ్రామానికి చెందిన మాజీ సొసైటీ డైరెక్టర్ మాజీ గ్రామ రైతుబంధు అధ్యక్షుడు ఆకారం హనుమాన్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం టిఆర్‌ఎస్ చేరారు. ఉమ్మడి సదాశివనగర్ మండలం మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల విద్యుత్తు రైతుబంధు రైతు బీమా లాంటి పథకాలు అమలు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. గతంలో పేదలకు సర్కార్ దావఖానాలు ఉచిత ప్రసూతి చేసి కెసిఆర్ కిట్టు అందజేసి సర్కారు వాహనంలో ఇంటి వద్ద దించేవారని అటువంటి సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు.
కేసీఆర్ చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే ప్రజలకు శ్రీరామరక్షని అందుకే మళ్ళీ టిఆర్‌ఎస్లోకి చేరుతున్నానన్నారు. కార్యక్రమంలో రామారెడ్డి మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి,జిల్లా బీసీ నాయకులు సాయా గౌడ్, మల్లు పెట్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, గోవర్ధన్ పాల్గొన్నారు.