18-07-2025 12:40:24 AM
ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, జులై17: మహిళలు బాగుంటే వారి కుటుంబం బాగుపడుతుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కేజిఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ హిళలు ఎమ్మెల్యే కు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం మహి ళా సంఘాలకు రూ . 4.96 కోట్ల విఎల్‌ఆర్ రుణాలు, రూ. 41.10 కోట్ల బ్యాంకు రుణాల చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కోసం డ్వాక్రా మహిళ లు నిర్వహిస్తున్న వ్యాపారాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. అనంతరం డ్వాక్రా మహిళలను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చై ర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, డీఆర్డీఓ శ్రీలత , ఆర్డీఓ చంద్రకళ, గుడిమల్కాపూర్ వైస్ చైర్మ న్ కావాలి చంద్రశేఖర్ గారు, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్ , ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి , అడిషనల్ డీఆర్డీఓ ,డీపీఎం, నాలుగు మండలాల ఏపీఎంఎస్, మం డల మహిళ సమైక్య అధ్యక్షురాలు, పార్టీ నాయకులు, డ్వాక్రా సంఘాల మహిళలుపాల్గొన్నారు..