08-12-2025 02:39:14 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి ఆధ్వర్యంలో భీంపూర్ మండలం లోని వాడేగం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికీ మాజీ ఎంపీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగదించారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నరన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేసి పార్టీ బలోపేతం చేసిన వారిని గెలిపించుకొని గ్రామాల అభివృద్ధి కి సహకరించగలన్నారు. కార్యక్రమంలో అరుణ్, జంగు, సునీల్, రవి, విష్ణు, లింగు, తులసీరామ్, సిద్ధార్థ్, ఫుల్ చాంద్, సంబు, సంబు, సెడుము, సురేష్, వాసుదేవ్, భీంరావ్ తదితరులు పాల్గొన్నారు.