calender_icon.png 8 December, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతాజీ జగన్నాడే మహారాజ్ జయంతి వేడుకల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి

08-12-2025 02:42:31 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ​అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్ కేంద్రంలోని దస్నాపూర్  లో సంత్ శిరోమణి శ్రీ సంతాజీ జగన్నాడే మహారాజ్ 401వ జయంతి వేడుకల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే  కోవ లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంతాజీ జగన్నాడే మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్,​ అఖిల గాండ్ల తేలి సంఘం జిల్లా అధ్యక్షుడు హివ్రే సందీప్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మెంగ్రే ఆకాష్, కోశాధికారి మెంగ్రే సంతోష్, మండల అధ్యక్షుడు బిజ్జు, వివిధ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.