calender_icon.png 8 December, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ లను గెలిపించే బాధ్యత మీది.. అభివృద్ధి చేసే బాధ్యత నాది

08-12-2025 02:36:14 PM

- నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో ప్రతి గ్రామానికి సర్పంచ్ అంతే ముఖ్యం

- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్లను గెలిపించే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని సింగారం, ఊకొండి, పులిపలుపుల, కొరటికల్ గ్రామాలలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార సరళని పరిశీలించి ఆయా గ్రామాల ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు ప్రజలతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన  సర్పంచ్, వార్డు మెంబర్  అభ్యర్థుల గుర్తులపై ఓటేసి గెలిపించి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని గ్రామస్తులను కోరారు.

సింగారం గ్రామానికి చేరుకుని గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను త్వరలోనే అభివృద్ధి చేస్తామని గ్రామంలోని ప్రధాన రోడ్డు వెడల్పు నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం ఊకొండి గ్రామానికి చేరుకొని గత పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు కూడా గత ప్రభుత్వాలు ఇవ్వలేకపోయామని ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. గతంలో రేషన్ బియ్యం తినలేక అమ్ముకునే వారిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ రేషన్ ద్వారా ఇచ్చే సన్నబియ్యాన్ని వండుకొని తింటున్నారని గుర్తు చేశారు. ఉకొండి నుండి తాళ్ల వెల్లంల వరకు రోడ్డు వెడల్పు పనులు చేపడతామని, బ్రాహ్మణ వెల్లంల  ప్రాజెక్టు నుండి  నీటి ని తీసుకొచ్చే కాల్వ పనులు కూడా పూర్తి చేస్తామన్నారు.

 విద్యా వాలంటీర్లకు సొంతంగా 40000 రూపాయలు ప్రతినెల అందిస్తున్నాను

పులిపలుపుల గ్రామానికి నాకు ఆత్మీయ అనుబంధం ఎక్కువని, పులిపలుపుల పాఠశాలలో  నలుగురు విద్య వాలంటీర్లకు ప్రతినెల రూ.40 వేల వేతనం సొంతంగా ఇస్తున్నానని ఈ గ్రామంలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ బడిని నిర్మించి ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా చేస్తానన్నారు. బ్రాహ్మణ వెల్లంల  ప్రాజెక్టు నుండి తన సొంత డబ్బులతో కాల్వ తవ్వించి పులిపలుపుల చెరువులోకి నీటిని తరలించామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందడంతోపాటు  పులిపలుపుల గ్రామస్తులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

 రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రాని రోడ్లు మునుగోడు నియోజకవర్గానికి వచ్చాయి

 రెండు సంవత్సరాలలో  రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రాని రోడ్లు మునుగోడు నియోజకవర్గానికి తీసుకొచ్చానని, రాబోయే రోజుల్లో గ్రామాలలో కరెంటు సమస్యలు ఉండకుండా అదనంగా 24 సబ్ స్టేషన్ లను మంజూరు చేయించాను అన్నారు.. కొరటికల్ గ్రామంలో  అర్హులైన ప్రతి ఒక్కరికి రెండో జాబితా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని తను బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించండి అని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,వివిధ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, కార్యకర్తలు ఉన్నారు.