భట్టి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరిక
12-05-2024 02:32 AM
వనపర్తి, మే ౧౧ (విజయక్రాంతి): వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో శనివారం తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ సహకార యూనియన్ మాజీ సభ్యుడు తిరుమల మహేశ్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ కండువాను కప్పి భట్టి విక్రమార్క కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్దికి అహర్నిశలు పని చేయాలని భట్టి సూచించారు.






