21 April, 2026 | 8:00 PM

Breaking News

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, వీల్ చైర్లు పంపిణీ   •   టిఆర్పి బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి   •   చల్లురు క్రషర్ తో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు ఎలాంటి సంబంధం లేదు   •   కొండపైన షాపులను రద్దు చేసి.. నిరుద్యోగులకు షాపులను ఇవ్వాలి   •   తిరుమల తిరుపతి వెంకటేశా   •   ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగులు సిద్ధం   •   గ్రామదేవతలకు పూజలు... ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయి   •   ఈ మహాసభలు మరెన్నో పోరాటలకు వేదిక కానున్నాయి   •   త్వరలో సోనాల మండల కేంద్రంలో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తాం   •   రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభంజనం   •  

దేశద్రోహి కేసీఆర్

12-05-2024 02:27 AM

దేశ భద్రతకు భంగం కలిగించేలా ఫోన్‌ట్యాపింగ్

నేను హిందువుల ఆశీర్వాదంతో బంపర్ మెజార్టీ సాధిస్తా

ఓడిపోతే రాజకీయా సన్యాసం తీసుకుంటా

బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్

కరీంనగర్, మే 11 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ యంత్రాంగంతో ఫోన్ ట్యాపింగ్ చేయించారని, దేశ భద్రతకు సంబంధించిన విషయం లో జోక్యం చేసుకుని ఆయన దేశద్రోహి అయ్యారని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజ య్ అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి శనివారం కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా బైక్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. మోదీ  లేని భారత్‌ను ఊహించుకోలేమని, మోదీ మళ్లీ ప్రధాని కాకుంటే భారత్ మరో పాకిస్థాన్‌గా మారే ప్రమాదముందన్నారు.

కాంగ్రెస్ మైనార్టీ సంతూష్టీకర ణ విధానాలతో 1950 నుంచి 2015 వరకు భారత్‌లో హిందువుల జనాభా 8 శాతం తగ్గి ముస్లింల జనాభా పెరిగిందన్నారు. కొన్ని ఇస్లామిక్ సంస్థలు దేశాన్ని మరో ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే ‘మనం ఇద్దరు.. మనకు ఇద్దరు’ అనే విధానాన్ని ప్రోత్సహిస్తామని, పొరపాటున కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎస్ గెలిస్తే ‘మనం నలుగురం.. మనకు నలభై మంది’ విధానాన్ని అమలు చేస్తారని ఎద్దేవా చేశారు.

కరీంనగర్‌లో నెలకొన్న సమస్యలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎనాడూ నోరు మెదపలేదన్నారు. తాను రైతులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగుల లబ్ధి కోసం ఎన్నో పోరాటాలు చేశానని గుర్తుచేశారు. తాను ఎంపీగా ప్రాతినిథ్యం వహించి రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకువచ్చానని, ప్రధాని మోదీ చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభింపజేశానని గుర్తుచేశారు. ముస్లింలంతా ఒక్కటై తనను ఓడించా లని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిస్తున్నారని, కానీ తాను హిందువుల ఆశీర్వాదంతోనే బంపర్ మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తంచేశారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. 

సర్జికల్ స్ట్రుక్‌పై రేవంత్‌వి సన్నాయి నొక్కులు

దేశ సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రుక్ జరిగిందనడానికి గ్యారెంటీ ఏమిటని సీఎం రేవంత్‌రెడ్డి సన్నాయి నొక్కులు నొకుతున్నారని, రేవంత్‌రెడ్డిని జవాన్ల చెంత కు తీసుకెళితే వారే నిజానిజాలు చెప్తారని తేల్చిచెప్తారన్నారు. కాంగ్రెస్ పాలన లోనే హైదరాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబ్ పేలుళ్లు సంభవించాయని గుర్తుచేశారు. ప్రధాని మోదీ పాలనలో అలాంటి ఘటన ఒక్కటైనా లేదన్నారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘కేటీఆర్ నువ్వొక నాస్తికుడివి. నీకు శ్రీరాముడి గురించి ఏం తెలుసు. నీకు ముస్లిం ఓట్లే కావాలా?  హిందువుల ఓట్లు వద్దా?’ అని ప్రశ్నించారు. భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కాంగ్రెస్ కూటమి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఎంఐఎం నేతలు మానసిక జబ్బులతో బాధపడుతూ బీజేపీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని, వారిని పిచ్చాసుపత్రిలో చేర్చాలన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.