21 April, 2026 | 7:06 PM

నా భూమికి రక్షణ కల్పించండి

21-04-2026 06:02 PM

మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని  నేరడవాయి గ్రామానికి చెందిన ముప్పాని శ్రీ రామ్ రెడ్డి తన సొంత వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 34.35.36 గల భూమిలో సుమారు 7 ఎకరాల 7 గుంటల వ్యవసాయ పట్టా భూమిలో నుంచి మా పొలం గెట్టు వెంట ఉన్న కొందరు రైతులు ఎలాంటి అర్హత లేకుండా నా భూమి మీదనుంచి పశువులు తొలుకుపోవడంతో నిత్యం వాహనాలు, కాలి నడకన వెళుతు నాభూమిలో పంట కు నష్టం కలిగిస్తున్నారని వాపోతు యస్ ఐ అజయ్ కుమార్,  తహసీల్దార్ యం.వెంకన్న కు వినతి అందించిన అయన విలేకర్ల తో వాపోతు చెప్పారు.