19-07-2024 05:02:50 PM
మహబూబ్నగర్ : రెడ్ క్రాస్ సేవలు అమోఘమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గత మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టిడి గుట్ట (45 వార్డు) లో ఇండ్లు కూలిపోయిన బాధితులకు ఎమ్మెల్యే చేతులమీదుగా, ఇండియన్ రెడ్ క్రాస్ వారు అందించిన వంట పాత్రలు, ప్లేట్లు , బెడ్ షీట్లు పంపిణీ చేసి మాట్లాడుతూ రెడ్ క్రాస్ అవసరమైన చోట ప్రత్యక్షం అవుతుంది అని, వారి సేవలకు విలువ కట్ట లేమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్. లయన్ నటరాజ్ , డాక్టర్ సామ్యుల్, సాయిబాబా , రాములు యాదవ్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.