16 May, 2026 | 1:45 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

16-05-2026 12:41 AM

ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.  టీఆర్పీ కార్యాలయం లో జిల్లా అధ్యక్షుడు బీసం ఆంజనేయులు సమక్షంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి పార్టీ కం డువా కప్పి ఆహ్వానించారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు జరుగుతున్న అన్యాయా లను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ముం దుకు రావాలని, నిజమైన సామాజిక న్యా యం సాధించాలంటే బీసీ రాజ్యాధికారం తప్పనిసరి అని స్పష్టం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ లక్ష్యంతోనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మల్లన్న చేస్తు న్న నిస్వార్థ పోరాటం, బీసీల పట్ల ఆయనకు న్న నిబద్ధత చూసి ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు.