16 May, 2026 | 1:45 AM

నేడు మారోజు వీరన్న వర్ధంతి

16-05-2026 12:43 AM

హాజరుకానున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): సూర్యాపేటలో శనివారం జరగనున్న అమరుడు మారోజు వీరన్న 27వ వర్ధంతి కార్యక్ర మంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొననున్నారు. సూర్యాపేటలోని గాంధీ పార్క్‌లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించబడే ఈ కార్యక్రమానికి మల్లన్న హాజరై ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మా ట్లాడుతూ.. రాష్ర్టంలో కొనసాగుతున్న సా మాజిక అన్యాయాలను ఎదుర్కొనేందుకు మారోజు వీరన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని, బీసీలకు నిజమైన రాజ్యాధికారం సాధించడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుం దని పేర్కొననున్నారు.