calender_icon.png 10 December, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక ఉన్నతికి జర్నలిజం పాటుపడాలి

08-12-2025 12:45:36 AM

-మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి

-సమాజంలో మీడియా పాత్ర కీలకం

-విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ కందా

-రాజేశ్వరరావు వ్రాసిన పుస్తకం అందరూ చదవాలి

-కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్

ముషీరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): జర్నలిజం సామాజిక దృక్పథం, సామాజిక ఉన్నతికి పాటు పడాల్సి ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పత్రిక రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్‌గా రాజ్యాంగంలో పొందుపర్చాలని అనేక మంది పట్టు బట్టారని, కానీ డా.బి.ఆర్.అంబేద్కర్ మాత్రం ఇందుకు వ్యతిరేకించారని గుర్తు చేశారు.

ప్రజల తరపున పనిచేయడానికి పత్రిక రంగం ఉండాలని పట్టుబట్టారని అన్నారు. ముందుగానే ఊహించి అంబేడ్కర్ పత్రిక రంగాన్ని రాజ్యాంగంలో బంధించకుండా అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యాక్షుడు ములుగు రాజేశ్వర్ రావు రచించిన ’నేను-బహువచనం(ఆత్మకథ)’, ’అధినాయక జయహే (కవితాసంకలనం)’ పుస్తకావిష్కరణ కార్యక్రమం సంఘం అధ్యక్షులు దాసు కేశవరావు అధ్యతక్ష జరిగింది.

ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రత్యేక అతిథిగా ఉమ్మడి ఎపి రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.మో హన్ కందా హాజరై రాజేశ్వర్ రావు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కష్టాలు ఉంటేనే నిలదొక్కుకొని, నిచ్చెన మెట్లు ఎక్కగలుగుతామని అన్నారు.

జర్నలిజంపై ఆత్మకథలు రాస్తున్నారని, చదువుతున్నారని అన్నారు. వినయ్ కుమార్, రాజేశ్వర్ రావు లు తనకు 40 ఏళ్లుగా తెలుసని, వారు కష్టా లు ఎదుర్కొని నిలదొక్కుకున్నారని తెలిపారు. ప్రస్తుత జర్నలిజంలో కొంత పరిస్థితి మెరుగైందని, గతంలో కంటే భిన్నంగా ఉం దన్నారు. రాజేశ్వర్ రావు ఇన్ని కష్టాలు ఎదుర్కున్నారని తెలియదని అన్నారు.

రాజేశ్వర్ రావు రాసిన ఆత్మకథ నవల మాదిరిగానే ఉందన్నారు. పుస్తకంలో 74వ పేజీ తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఉన్నత కుటుం బం నుంచే వచ్చిన రాజేశ్వర్ రావు కష్టాల పాలయ్యారని అన్నారు. రాజేశ్వర్ రావు ఆత్మకథ చదివితే నూతనతరం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని నూచించారు. తెలంగాణ మీడియా అకాడమీ తరపున 12 మంది ప్రముఖ జర్నలిస్టుల పస్తకాలు ఆవిష్కరించనున్నట్లు చెప్పారు.

పత్రికలకు సం బంధించిన సుమారు ఐదు లక్షల పేజీలను ఆన్ లైన్ లో చూసేందుకు ఆకాడమీ ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.మోహన్ కందా మాట్లాడుతూ మాజంలో మీడియానే కీలక పాత్ర అని, ఇలాంటి మీడియా పరిపక్వత, వివేకం, గౌరవం, బాధ్యతాయుతంగా వ్యవహారిస్తే మరింత విలువ పెరుగుతుందని అన్నారు.

సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా పొందుపర్చినట్టు వివరించారని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ రాజేశ్వర్ రావు ఆత్మకథ పుస్తకం చదివితే ఆకలి రాజ్యం, సాగర సంగమం సినిమాలు చూసినట్టుగా ఉందన్నారు.

రాజేశ్వర్ రావు జీవితం సినిమా అవుతుందని అన్నారు. రాజేశ్వర్ రావు రాసిన పుస్తకం చదివితే యువ జర్నలిస్టులు నేర్చుకోవచ్చని అన్నా రు. కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ రాజేశ్వర్ రావు రాసిన పుస్తకం అందరు చదువుకోవాల్సిన పుస్తకమని సూచించారు. ఆయన అన్ని రకాల రచనలు చేశారని అన్నారు.

పుస్తక పరిచయం వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యాక్షులు టి. ఉడయవర్లు పరిచయం చేయగా ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు జి.వల్లీశ్వర్, ఎమెస్కో సంపాదకులు డి. చంద్రశేఖర్ రెడ్డి, సంఘం కార్యదర్శి కె.లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.