calender_icon.png 8 December, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలువల వెలుగుదీపం..

08-12-2025 01:01:51 AM

మార్గనిర్దేశకుడు.. నర్రా రాఘవరెడ్డి 

నకిరేకల్, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): తెలుగు రాష్ట్రా రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధతకు ప్రతీకగా, ప్రజల మన్ననలు పొందిన మార్గనిర్దేశకుడు, మార్క్సిస్టు నేత నర్రా రాఘవరెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు. శత్రువుని ఎరుగని స్వభావం, విలువలపై కచ్చితమైన నిబద్ధత, ప్రజాస్వామ్య పరిరక్షణలో చూపిన ధైర్యం ఆయనను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపాయి.

సర్పంచి పదవి నుంచి ప్రజా ప్రయాణం 

1959లో శివనేనిగూడెం సర్పంచిగా పదవి చేపట్టి 1967 వరకు ఆదర్శ పరిపాలనకు నాంది పలికారు. గ్రామాభివృద్ధి, పారదర్శకత, ప్రజలతో నేరుగా మమేకం  ఇవన్నీ ఆయన స్థానిక పాలనకు గుర్తింపు. 1950లో సీపీఐలో చేరి, చిలికా తర్వాత సీపీఎంలో చేరి ప్రజా ఉద్యమాలకు అంకిత మయ్యారు.

ఆరుసార్ల ఎమ్మెల్యే.. ప్రజాభిమాన సాక్ష్యం 

 నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నుండి 967లో తొలి విజయం సాధించిన రాఘవరెడ్డి, ఒకసారి ఓటమిపాలై 1972, 1978, 1984, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా గెలిచి నకిరేకల్ నియోజకవర్గానికి ఆరు సార్లు ప్రాతినిధ్యం వహించారు. శాసనసభలో పార్టీ శాసనసభాపక్ష నేతగా నిలిచి అనేక ప్రజా సమస్యలను ధైర్యంగా ముందుకు తెచ్చారు.

ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు 

కల్లుగీత కార్మికులు, చేనేత వర్గం, గ్రామసేవకుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం పోరాడారు. విలువలపై స్థిరంగా ఉన్న ఆయన, ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరించేవారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక నేత 

ఎన్టీఆర్ను అన్యాయంగా పదవి నుంచి తొలగించిన సమయంలో, సీపీఎం, సీపీఐ చేపట్టిన *ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం*లో రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన నిజాయితీ, ధైర్యం వల్లే ఎన్టీఆర్ ప్రత్యేకంగా గౌరవించారు.

ఓటుహక్కుపై నిబద్ధత 

వృద్ధాప్యంలోనూ, భార్యతో కలిసి ప్రతి ఎన్నికలో పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేయడం ఆయనకు విధి, కర్తవ్యం. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వెయ్యాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి . ప్రజల కోసం పరితపించే నాయకుని ఎన్నుకోవాలని ప్రజలకు సందేశం ఇచ్చేవారు.

ముగిసినా, నిలిచిపోయిన ప్రజాసేవ 

2015 ఏప్రిల్ 9న, 92 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. కానీ ప్రజల కోసం జీవించిన నిజమైన నాయకుడు ఎలా ఉండాలో చూపిన జీవంత ఆదర్శంగా నర్రా రాఘవరెడ్డి చరిత్రలో శాశ్వతంగా నిలిచారు.

మార్గనిర్దేశకుడు, మార్క్సిస్టు, మచ్చలేని నాయకుడిగా ఆయన జీవితం ప్రతి పౌరుడికి ఓటుహక్కు, ప్రజాసేవా విలువలను రక్షించే సందేశం. నిజాయితీ, ధైర్యం, ప్రజల పట్ల నిబద్ధత ఇవే ఆయన వారసత్వం.