calender_icon.png 4 December, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా విడుదల

04-12-2025 01:12:26 AM

గుమ్మడిదల, నవంబర్ 3 :గుమ్మడిదల మండలం పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించిన బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. బుధవారం సిజిఆర్ ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్ర బిఆర్‌ఎస్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి సంయుక్తంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వీరారెడ్డిపల్లిలో బుద్దుల దుర్గ నర్సింగరావు,

రాంరెడ్డి బావిలో పట్నం పద్మారెడ్డి, కానుకుంటలో పూడూరి యాదగిరి యాదవ్, అనంతారంలో కొమ్ము శ్రీను, నాగిరెడ్డిగూడెంలో గడ్డం లావణ్య గోవర్ధన్ రెడ్డి,కొత్తపల్లిలో సూరారం మంజుల సత్తయ్య, నల్లవల్లిలో రాజబోయిన అనిత శ్రీనివాస్, మంబాపూర్ లో తలారి దయానంద్ బరిలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వేణు, గణేష్‌అప్ప, జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు రాజేష్, రామకృష్ణ పాల్గొన్నారు.