calender_icon.png 21 August, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టుల ఆందోళన

21-08-2025 07:13:45 PM

ఇళ్ల స్థలాల కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట 29TUWJ ఆందోళన

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయించాలని కోరుతూ ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(TUWJ) జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీందర్ వెంకయ్య గారి భూమయ్య తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించడం జరిగింది. జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇంటి స్థలాల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటికీ, నిర్మల్ జిల్లాలో మాత్రం ఈ ప్రక్రియలో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, మొదటి దశగా ఈ నెల 25వ తేదీన మండల స్థాయిలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు.

ఆ రోజు అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేయనున్నారు. రెండో దశలో, ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ డిమాండ్లను కలెక్టర్‌కు విన్నవించాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, కొంతకాలంగా నిలిచిపోయిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేసి, జిల్లా మహాసభను నిర్వహించాలని కూడా తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ రెడ్డి, జిల్లా స్పెషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వేణుగోపాల్, గుమ్ముల అశోక్, పూసల పోశెట్టి, రాచమల్ల రాజశేఖర్, టి. రవీందర్, జిల్లా సంయుక్త కార్యదర్శి జల్దా మనోజ్, సట్ల హనుమన్లు , ప్రచార కార్యదర్శి రాజేశ్వర్, జిల్లా కార్యవర్గ సభ్యులు షిండే మహేష్, కొల్లి రాజేశ్వర్, డిఎస్ మధు పలువురు జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు.