21-08-2025 08:54:18 PM
గోదావరిఖని (విజయక్రాంతి): గోదావరిఖని మున్సిపల్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ హరి శేఖర్ పెద్దపల్లి నుండి మంచిర్యాల వైపు వెళుతున్న రన్నింగ్ ఆటో నుండి జారీ పడి తీవ్ర రక్త గాయలతో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ స్వయంగా హాస్పిటల్ కి హుటాహుటిన తీసుకుని వెళ్ళి ప్రాణాలు కాపాడారు. ఆటోను 1-టౌన్ పోలీస్ లకు అప్పగించారు. ఈ విషయం తెలిసిన ట్రాఫిక్ ఏసీబీ శ్రీనివాసులు, సీఐ రాజేశ్వరరావులు అభినందించారు.