21-08-2025 09:35:46 PM
వరంగల్ (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వైఫల్యాలను బూచిగా చూయించి ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని ప్రణాళిక బద్ధంగా ఉద్యమాలను నిర్వహించాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్(MCPIU District Secretary Peddarapu Ramesh) పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ రంగసాయపేటలోని ఒక హోటల్లో రత్నం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, జిల్లా వెనుకబడుతనానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని జిల్లా అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
వరంగల్ నగరాభివృద్ధికి నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం పూర్తిచేయాలని ప్రయాణికుల సౌకర్యం బస్టాండు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు జిల్లాకు ప్రాముఖ్యత నుంచి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. రంగసాయిపేట ఏరియా కార్యదర్శిగా గణిపాక ఓదేలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.