calender_icon.png 21 August, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

21-08-2025 09:02:20 PM

ఎస్ఐ ప్రవీణ్.. 

మునగాల (విజయక్రాంతి): ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని ఎస్ఐ ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) అన్నారు. గురువారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గణేష్ మండపాల నిర్వాహకులు పాటించవలసిన నియమ నిబంధనలు, గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే. ప్రతీ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నిర్దేశించిన సమయనికి నిమర్జనం పూర్తి చేయాలి. గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.

మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్ల ను మండపంలో ఏర్పాటు చేయాలి. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.