21-08-2025 08:44:14 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ముత్యాలమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. కొత్తపేట కాలనీకి చెందిన మహిళలు ముందుగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి డప్పు వాద్యాలతో ముత్యాలమ్మ తల్లి వద్దకు చేరుకొని భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ముత్యాలమ్మ తల్లికి పసుపు కుంకుమలతో నైవేద్యాన్ని సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల రాములు, చింతకింది వీరయ్య, ఎర్రళ్ల యాదయ్య, వెంకటయ్య, బాబు, ఎర్రోళ్ల లింగస్వామి, కిష్టయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.