calender_icon.png 21 August, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశోక్ కు డాక్టరేట్ పురస్కారం

21-08-2025 08:49:07 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) చిన్న గూడూరు మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన దుండి అశోక్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ నాతో ఉత్సవంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఇస్రో  ఛైర్మెన్ డాక్టర్ నారాయణ్ అశోక్ కు  ఆంగ్ల విభాగంలో,  దళిత మహిళా సాహిత్యం లో డాక్టరేట్ ను ప్రదానం చేశారు. నరేటివ్స్ అఫ్ రెసిస్టెన్స్, ఏ స్టడీ అఫ్ ఐడియాలజీ అండ్ సోషల్ క్రిటిసిజం ఇన్ ధ సెలెక్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ గోగు శ్యామల అండ్ జూపాక సుభద్ర అనే పరిశోధన గ్రంధానికి డాక్టరేట్ వరించింది. 2013 లో దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇఫ్లూ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ ట్రాన్సలేషన్ స్టడీస్ లో అశోక్ రాసిన సిద్ధాంత గ్రంధానికి మాస్టర్ అఫ్ ఫిలాసఫీని అవార్డు చేసింది.

దానితో పాటు ఆన్ టచబిలిటీ ఇన్ మైథలాజికల్ పర్స్పెక్టివ్స్ , హెటెరోగ్లాసియ ఇన్ ట్రాన్సలేషన్ మరియు ఇతర పరిశోధన పత్రాలను అంతజాతీయ స్థాయిలో ప్రచురించారు. తన కాలేజ్ జ్ఞాపకాల స్మృతుల ఆధారంగా ‘నా కళాశాల’ మరియూ మై కాలేజ్ కోర్టుయ్యార్డ్ అను ఇతర స్వీయ రచనలు చేశారు. మారుతున్న కాలంలో కాలేజీ విద్యార్థుల కౌమార దశ మనస్తత్వాలకు అనుకూలంగా విద్యా బోధన చేస్తూ ఫ్రెండ్లీ లెక్చరర్ గా పేరు తెచ్చుకున్నారు.