calender_icon.png 21 August, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

21-08-2025 08:39:57 PM

చివ్వెంల (విజయక్రాంతి): చివ్వెంల మండలం(Chivvemla Mandal)లోని బండమీద చందుపట్ల గ్రామంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన లబ్దిదారులకు కొత్తరేషన్ కార్డులు- ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ... దశల వారీగా నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, పట్టాలు తీసుకున్నవారు రేపటి నుండి ముగ్గుపోసి ఇండ్ల నిర్మాణం చేసుకోవాలి. భూమి ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు, మాజీ జెడ్పిటిసి, ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ళ రమేశ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం.డి.అంజద్ అలి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ నాయుడు, దండు మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి,డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, నంద్యాల సోమిరెడ్డి, బాబు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడి రెక్క కొండల్, బొడుపుల హరికృష్ణ, గుద్దేటి వెంకన్న,ముద్ద వెంకన్న, పిన్ని శ్రీను, అనంతుల సైదులు, ఎల్కా మధు, కోడి వీరస్వామి, సిద్ధోజు రమేష్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.