14-01-2026 12:46:52 AM
బిచ్కుంద, జనవరి 13 (విజయ క్రాంతి): బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఘనంగా శంకుస్థాపనలు చేశారు. అందులో భాగంగా కల్వర్టుల నిర్మాణం, వరద నీటి నివారణ పనులు, మురికి నీటి కాలువల నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం వంటి పలు కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ పనులు పూర్తయితే పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.
సుమారు రూ.15 కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు..అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఎమ్మెల్యే యూనిఫార్మ్లను అందజేశారు. ప్రజా సేవలో ముందుండే సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక మండల నాయకులు పాలుగోన్నారు.