14-01-2026 12:47:32 AM
వ్యర్ధాలకు నిప్పు విద్యార్థులకు తిప్పలు
మరిపెడ, జనవరి 13 (విజయ క్రాంతి): మరిపెడ మున్సిపాలిటీ వీధుల్లో శుభ్రం చే సిన చెత్త, వ్యర్థ పదార్థాలను పట్టణ శివారులోని గిరిపురం క్రాస్ రోడ్డు కస్తూర్బా గాంధీ హాస్టల్ పక్కన వేస్తున్నారు. నాలుగైదు రోజు ల తర్వాత పేరుకుపోయిన వ్యర్థాల చెత్తకుప్పలకు నిప్పు పెడుతుండడంతో కలుషిత వా యువుతో కూడిన పొగతో కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. ఒక్కో సారి అటు చెత్త, ఇటు దుర్వాసనతో కూడిన పొగ వస్తుండడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా ఇ బ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుర్వాసన, చెత్త వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారి, దో మలు, ఈగలు ఇతర క్రీములు పెరిగి వ్యా ధులు వచ్చే ప్రమాదం ఉందని విద్యార్థులు, స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ పక్కన మున్సిపాలిటీ చెత్త సమస్య హాస్టల్ విద్యార్థులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు, దుర్వాసన, పందులు, కోతుల బెడద విరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి పరిష్కారంగా డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించకపోవడం వల్లనే అని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక మున్సిపాలిటీ, సంక్షేమ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోనీ డంపింగ్ యార్డును ఇక్కడ నుంచి వేరే చోటకు తరలించకపోతే రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ఆందో ళన చేస్తామని బీఆర్‌ఎస్ నాయకుడు బానో త్ శ్రీను హెచ్చరించారు.