08-10-2025 01:08:31 AM
బిచ్కుంద సెప్టెంబర్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతిరెడ్డి మాతృమూర్తి పరమపదించిన విషయం తెలిసిందే.. మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి వెళ్లి వారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూపతిరెడ్డి మాతృమూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.