10-09-2025 12:00:00 AM
-నేడు, రేపు ఉమ్మడి జిల్లాలో మంత్రి పర్యటన
-పంట నష్టం ప్రకటనపై రైతులు ఎదురుచూపు
నిర్మల్, సెప్టెంబర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి కడెం స్వర్ణ వాగు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వరదతో ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా సరిహద్దు గ్రామమైన బాసరలో మూడు రోజులపాటు రికార్డ్ స్థాయిలో గోదావరి వరద రావడంతో వేలాది ఎకరాలు నీటములుగా బాసర పట్ట ణం కొన్ని కాలనీలు మూడు రోజులు వరద నీటిలో ముంపు గురయ్యాయి.
అదేవిధంగా స్వర్ణగడ్డెన్న శుద్ధ వాగు కడెం నదులతో పాటు గోదావరి శ్రీరాంసాగర్ దిగువన వరద పోటెత్తాడంతో జిల్లాలో 12 వేల ఎకరాల వరకు పత్తి వరి జొన్న సోయా పసుపు పంటలు దెబ్బతిన్నాయి. బాసర మాదాపూర్ సోను కూచంపల్లి తిరుపల్లి గ్రామాల్లో వరదతో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించిన రైతులు నష్టపోయిన పంటలకు పరి హారం చెల్లింపుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు బాసర చేరుకున్న మంత్రి ముంపు గురైన ఇండ్లను పంటలను పరిశీలించి బైంసా నిర్మల్ రూట్లో దెబ్బతిన్న పం టలను పరిశీలించి కలెక్టర్ కార్యాలయంలో పంట నష్టం సర్వే ప్రభుత్వం ద్వారా చేపట్టిన సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
అయితే ప్రభుత్వం వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని నిర్మల్ జిల్లాలో బిజెపి, బీఆర్‌ఎస్ ఇ తర రాజకీయ పార్టీలు రైతు సంఘాల నాయకులు జిల్లా అధికారులకు మొరపెట్టుకుంటు న్నారు. ఎకరానికి 25,000 చెల్లించాలని రైతు లు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క జిల్లాకు 10 కోట్లు వరద నష్టం నిధులను మంజూరు చేయగా వీటితోనే తెగిపో యిన రోడ్లు బిరుదులు చెరువులు పంట నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండడంతో ప్రభుత్వం పంట నష్టం పై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని జిల్లా రైతులు కోరుతున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి రైతులకు ఏమేరా భరోసా కల్పిస్తారో వేచి చూడవలసింది.
నేడు మంత్రి జూపల్లి పర్యటన..
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ సమీపంలోని చంద్రశేఖర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్ర మానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం పరిశీలించారు. ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసే స్టాళ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ, పలు పథకాల కింద ధ్రువీకరణ పత్రాల పంపిణీకి సంబంధించి, ఏర్పాట్లను ఆమె సమీక్షించారు.
కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నిర్దేశిత సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించా రు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డిఆర్డిఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్లు రాజు, సంతోష్ తదితర అధికారులు పాల్గొన్నారు.