calender_icon.png 9 November, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాది పెట్టుకోండి.. రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం వస్తది!

09-11-2025 02:01:28 AM

  1.   14 తర్వాత రాష్ట్రంలో పెను తుఫాన్
  2. ఆకురౌడీలు తోక జాడిస్తే కత్తిరిస్తాం
  3. రేవంత్‌రెడ్డి కూడా కాపాడలేడు
  4. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడితేనే హామీలు అమలవుతాయి
  5. ఎర్రగడ్డ రోడ్ షోలో కేటీఆర్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): ‘యాది పెట్టుకోండి.. రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం వస్తది. కత్తి మాకు ఇచ్చి పోరాడమంటే పోరాడుతాం. అంతేగానీ కత్తి మళ్లీ కాంగ్రెస్‌కు ఇస్తే మేం ఏమీ చేయలేం. ఈ నెల 14 తర్వాత రాష్ట్రంలో పెను తుఫాన్ రాబోతోంది. ఇప్పుడు ఎవరెవరు ఎగిరిపడుతున్నారో, ఎవరు తోక జాడిస్తున్నారో వాళ్లందరి తోకలు కత్తిరిస్తాం. ఆ ఆకురౌడీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కాపాడలేడు’.

అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా  శనివారం ఎర్రగడ్డలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన భారీ రోడ్‌షోలో కేటీఆర్ ప్రసంగించారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఒక్కసారి ఓటేసిన పాపానికి ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. ఆప్.. కాంగ్రెస్‌కు మోకా దియా.. కాంగ్రెస్ దోకా దియా’ అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి, ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌కు ఓటెస్తే మళ్లీ మోసపోవుడేనని కేటీఆర్ చెప్పారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 24 గంటల కరెంట్ వంటి పథకాలతో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఈ రెండేళ్లలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, ఆటో అన్నల బతుకులు ఆగమయ్యాయని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అని విమర్శించారు.

కారు వర్సెస్ బుల్డోజర్

ఈ ఎన్నిక కారు గుర్తుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న యుద్ధమని కేటీఆర్ అభివర్ణించారు. ‘ఇందిరమ్మ రాజ్యం పేరుతో హైదరాబాద్‌లో వేలాది పేదల ఇళ్లను హైడ్రా భూతంతో నేలమట్టం చేస్తున్నారు. ఇది అన్యాయం. మీ ఇంటిని కూల్చే బుల్డో జర్‌కు ఓటేస్తారా.. మిమ్మల్ని కాపాడే కారుకు ఓటేస్తారా.. మీరే తేల్చుకోవాలి. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, ఆ బుల్డోజర్ వచ్చి మీ ఇంటిని కూలగొడు తుంది.

అదే బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బుల్డోజర్‌కు అడ్డంగా పడుకుని మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది’ అని భరోసా ఇచ్చారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గం చెరువులో ఇల్లు కడితే హైడ్రా వెళ్లదు. మంత్రులు పొంగులేటి, వివేక్‌ల అక్రమ నిర్మాణాల జోలికి పోదు. కానీ పేదల ఇళ్లను మాత్రం కూల్చేస్తారు. ఇదేనా మీ పాలన’ అని కేటీఆర్ నిలదీశారు.

దౌర్జన్య రాజకీయాలు సిగ్గుచేటు

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నేతలు, బీఆర్‌ఎస్ నాయకులపై దౌర్జ న్యాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరో పించారు. తమ పార్టీ నాయకులను బల వంతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పా రని ఆరోపించారు. ఇలాంటి నీతిమా లిన పనులు చేయడానికి వారికి సిగ్గుం డాలని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎన్నిక ల్లో మాతో పోరాడాలి అని సవాల్ విసిరా రు. కాగా కాంగ్రెస్ నాయకులు ఓటుకు రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకు పంచు తున్నారని, ఆ డబ్బులు తీసుకుని, ఇచ్చిన హామీల్లో బకా యిలను కలుపుకుని ఎప్పు డిస్తారని అడగా లన్నారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమ లుచేయకుండా బాకీ పడ్డ డబ్బుల్లోంచే మీకు ఇస్తున్నారు’ అని కేటీఆర్ చెప్పారు. జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే అది ఇచ్చి న హామీలన్ని అమల వుతాయని అన్నారు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న మాగంటి సునీతపై చిల్లర ప్రచారం చేస్తున్నారని, ఆమెకు అండగా నిలవాలని కోరారు.