09-11-2025 02:00:37 AM
ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాం తి): ప్రభుత్వ అనుమతితో త్వరలో విద్యుత్ శాఖలో నూతన నియామకాలు చేపడుతామని ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. జీపీఎఫ్ సదుపాయం ప్రభుత్వ పరిధిలోని అంశమని, పాలకుల నిర్ణయాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటా మని చెప్పారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను కూడా అతిత్వరలో చేపడు తామని, వేతన సవరణకు కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
శనివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య ఆడిటోరియంలో తెలం గాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని వీఏఓఏటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.అశోక్ అధ్యతన నిర్వహించా రు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నవీన్ మిట్టల్ హాజరై మాట్లాడారు. గడిచిన రెండేళ్లలో ఎన్నో విజయాలు విద్యుత్ సంస్థలు సాధించాయని, కొన్ని అంశాల్లో ఇంకా మెరు గు అవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభు త్వ రంగ సంస్థలు మనుగడ సాధించాలంటే అతి తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, రవాణా నష్టాలు లేకుండా ఉత్తమ పంపిణీ జరుపుతూ కచ్చితత్వంతో బిల్లుల వసూలు చేయాల్సిన అవసరముందన్నారు. సమావేశంలో టీజీఎస్పీడీఎసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాపకంటి అంజ య్య, అసోసియేషన్ నాయకులు నసార్ షరీఫ్, శ్రీహరి స్వామి, సీహెచ్ శ్యామల్ రావు తదితరులు పాల్గొన్నారు.