16 July, 2026 | 2:03 AM

ఉద్యమకారులకు న్యాయం చేయాలి

16-07-2026 01:54 AM

తెలంగాణ ఉద్యమకారులు

ఆలేరు, జులై 15 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పింఛన్, స్వాతంత్ర సమరయోధులుగా గుర్తింపు, హెల్త్ కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆలేరు మండల ఉద్యమకారులు బుధవారం స్థానిక రహదారి బంగ్ల లో డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఇప్పుడే మంత్రివర్గ కమిటీ వేసి సమావేశం అయ్యారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని,

అనేకమంది జైలుకు వెళ్లారని, లాఠీ దెబ్బలు తిన్నారని, అమరులయ్యారని గుర్తు చేశారు. ఏర్పాటైన కమిటీ పక్షపాతం లేకుండా నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని, ఈ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు జంపాల శ్రీనివాస్, బాలస్వామి,రచ్చ రామ్ నరసయ్య, జర్నలిస్టు జిల్లా నాయకులు యేలుగల కుమారస్వామి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సీస మహేశ్వరి, అనసూయ, మొరిగాడు సుజాత, నాయకులు దొంతుల ఎల్లేష్, పుట్టల కిష్టయ్య, నీల రామన్న, గుజ్జు అశోక్ తదితరులు పాల్గొన్నారు.