మృతురాలు కొరిమి లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి
గౌరారం రాజీవ్ రహదారిపై ఆందోళన
గౌరారం, జూన్ 17: గౌరారం రాజీవ్ రహదారిపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొరిమి లక్ష్మి కుటుం బానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె బంధువులు, గ్రామస్థులు గౌరారం పోలీస్ స్టేషన్ ఎదుట రాజీవ్ రహదారిపై ముళ్ల కంచెలు వేసి నిరసన, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ, ప్ర మాదంలో మృతి చెందిన లక్ష్మి కుటుం బం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని, ఆమె భర్తకు కాళ్లు విరగడంతో కుటుంబం ఆర్థికం గా, సామాజికంగా దిక్కుతోచని పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు అనాథల మాదిరిగా మారారని పేర్కొన్నారు.
ప్రమాదానికి కారణమైన వాహనం ప్రభుత్వానికి చెందినదేనని, అయినప్పటికీ పోలీసులు వాహన యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రమాదానికి గురైన కారుకు వాహన గడువు ముగిసిందని, ఇన్సూరెన్స్ కూడా లేదని, పెండింగ్ చలాన్లు ఉన్నాయన్నారు. అలాగే, తమ నిరసన సందర్భంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బంధువులు ఆరోపించారు.
ముంపు గ్రామాల ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రమాద బాధిత కుటుంబాలకు కూడా సరైన న్యాయం జరగడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొరిమి లక్ష్మి కుటుంబానికి తగిన పరిహారం, న్యాయం అందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.






