calender_icon.png 2 May, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు న్యాయం జరగాలి

27-11-2024 12:00:00 AM

ఫార్మా పేరుతో లగచర్ల బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించడానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటామని ప్రకటించడం సంతోషదాయకం. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంగారెడ్డి సెంట్రల్ జైలులో సోమవారం లగచర్ల బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

జైలులో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పడం అభినందనీయం. అక్కడి జైలులో మొత్తం 24 మంది స్టేట్‌మెంట్‌ను ఆయన రికార్డు చేశారు. ఐతే, కలెక్టర్‌పై దాడి మాత్రం దురదృష్టకరమని చైర్మన్ అన్నారు.

 రాజమల్లు, మహబూబ్‌నగర్