calender_icon.png 28 October, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్రాసిటీ కేసులో బాధితులకు న్యాయం చేయాలి

28-10-2025 12:00:00 AM

 ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య 

 మేడ్చల్, అక్టోబర్ 27(విజయ క్రాంతి):   ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు న్యాయం జరిగేలా  సంబంధిత అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.  సోమవారం  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ల్యాండ్ సర్వీస్ ప్రత్యేక నిధి, అట్రాసిటీస్ పైన జరిగిన సమీక్ష సమావేశానికి డిసిపి కోటిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్‌ఓ హరిప్రియ లతో కలిసి  తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరైనారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లా డుతూ ఏసీపీ ల వద్ద ఇప్పటివరకు ఉన్న కేసుల వివరాలు వాటి పురోగతిని అడిగి, పెండింగ్ లో ఉన్న  కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని కొన్ని ముఖ్యమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని, అలాగే విచారణ దశ లో ఉన్న బాధితులకు నిబంధనల మేరకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

బాధితులకు అందజేసే రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపుల విషయంలో రాష్ట్రంలోనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రస్థాన ంలో నిలిచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ విషయంలో అధికారులు, పోలీసుల కృషి ప్రశంసనీయమని చైర్మన్ అన్నారు.  ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఆర్డీవో  టి శ్యాంప్రకాష్, కీసర ఆర్డిఓ  కేవీ ఉపేందర్ రెడ్డి, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి జి వినోద్ కుమార్, జిల్లా ఎస్టీ డెవలప్మెంట్ అధికారి ఎన్ పద్మజ, పిడిఎస్సి కార్పొరేషన్ బాబు మోజస్, జి ఎం డి ఐ సి డి వినయ్ కుమార్, పిడి హౌసింగ్ పివి రమణమూర్తి, ఏసీపీలు,  ఇతరులు పాల్గొన్నారు.