23 August, 2026 | 7:51 AM

ఎమ్మెల్సీగా నవీన్ ప్రమాణస్వీకారం

13-06-2024 12:58 PM

హైదరాబాద్: ఎమ్మెల్సీగా నవీన్ కుమార్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఉపఎన్నికలో నవీన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నవీన్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు తన విజయాన్ని అంకితం చేస్తున్నాని నవీన్ పేర్కొన్నారు.