సబ్ కాంట్రాక్టర్లపై జస్టిస్ పీసీ ఘోష్ దృష్టి
15-06-2024 03:46 PM
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం విశ్రాంత ఇంజినీర్లతో సమావేశం అయింది. గోదావరి జలాలపై తమ నివేదికలను విశ్రాంత ఇంజనీర్లు కమిషన్ కు వివరించారు. అనకట్ట నిర్మాణానికి మేడిగడ్డను మాజీ సీఎం కేసీఆర్ సూచించారని తెలిపినట్లు సమాచారం. అనకట్ట నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై దృష్టి సారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సబ్ కంట్రాక్టర్ల వివరాలు సేకరించే పనిలో ఉంది. అఫిడవిట్లు అన్ని వచ్చిన తర్వా తదుపరి విచారణను ప్రారంభించనున్నట్లు కమిషన్ తెలిపింది.






