19 August, 2026 | 6:12 AM

ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు: మల్లికార్జున్ ఖర్గే

15-06-2024 03:55 PM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏప్పుడైనా కూలిపోవచ్చని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వానికి మెజార్టీ లేదని, ఎన్డీయే సర్కార్ పోరపాటున ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అయితే మోడీ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు. దేశానికి మంచి జరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఖర్గే గుర్తుచేశారు. అయితే ఏ పనికూడా మంచిగా జరగకుండా చేయడం ప్రధాని మోడీకి అలవాటని విమర్శించారు. దేశం బలోపేతం కావడానికి తామ సహకరిస్తూనే ఉంటామని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.