05-09-2025 12:00:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని, రోజులు మారినా బీసీల రాతలు మారడం లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కంచే చేను మేసే విధంగా పాలకుల ప్రవర్తన ఉందని, జాతీ య న్యాయ కళాశాలల్లో బీసీ విద్యార్థులకు రిజర్వేషన్ అమ లు కావడం లేదన్నారు. ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయమైన నల్సార్‌లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో అనేక ఉద్యమాల తర్వాత నేషనల్ బీసీ కమిషన్ అన్ని న్యాయ విశ్వ విద్యాలయాల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింద ని, నల్సార్‌లో రిజర్వేషన్లు అమలు కాకపోవడం సిగ్గు చేటన్నారు.
రూల్ అఫ్ లా న్యాయ విశ్వవిద్యాలయాల్లో అమ లు కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మోదీ ఓబీసీ అయి నా బీసీలకు అన్యాయమే జరుగుతోందని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలని లేఖ రాశామన్నారు.
ఈ వివక్షకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దూదిమెట్ల బాలరా జ్‌యాదవ్, చిరుమళ్ల రాకేష్‌కుమార్, జాతీయ ఓబీసీ వి ద్యార్ధి సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.