calender_icon.png 13 August, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ అప్పీల్ ట్రైబ్యునల్ సభ్యుడిగాజస్టిస్ వేమిరెడ్డి భాస్కర్‌రెడ్డి

07-08-2025 01:10:39 AM

కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు

న్యూఢిల్లీ, ఆగస్టు 6: జీఎస్టీ వివాదాల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ట్రైబ్యునల్ ఏర్పా టుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో ప్రిన్సిపల్ బెం ఖిం.. రాష్ట్రాల్లో జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంచ్‌లు ఏర్పాటు కానున్నాయి.

ఈ ట్రైబ్యున్యళ్లకు 53 మంది జ్యుడీషియల్, 31 మంది సాం కేతిక సభ్యులు నియమితులయ్యారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా తెలంగాణ హైకోర్టు న్యాయవాది జస్టిస్ వేమిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 1987లో బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకున్న భాస్కర్ రెడ్డి న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారు. తెలంగాణ హైకోర్టులో 2022లో భాస్కర్ రెడ్డి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు.